తెలంగాణ ఉద్యమానికి దాశరథి స్ఫూర్తి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దాశరథి స్ఫూర్తినిచ్చారని, నిజాం కాలంలో ప్రజలు అనుభవించిన కష్టాలను, రైతుల బాధలను తన కవిత్వాలల్లో ప్రతిబింబేంచేలాచేయడమే కాకుండా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసేలా చైతన్యపరిచిన అక్షర పోరాటయోధుడు దాశరథి అని ప్రము ఖ కవి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
- నిజాం ప్రభుత్వంపై తిరగబడిన గొప్ప కవి
- దాశరథి శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభలో దేశపతి
- మహాకవికి ఘన నివాళులర్పించిన ప్రముఖులు
మహబూబాబాద్/చిన్నగూడూరు, జూలై 22(నమస్తే తెలంగాణ): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దాశరథి స్ఫూర్తినిచ్చారని, నిజాం కాలంలో ప్రజలు అనుభవించిన కష్టాలను, రైతుల బాధలను తన కవిత్వాలల్లో ప్రతిబింబేంచేలాచేయడమే కాకుండా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసేలా చైతన్యపరిచిన అక్షర పోరాటయోధుడు దాశరథి అని ప్రము ఖ కవి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన దాశరథి శతజయంతి ప్రారం భ సభను ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అధ్యక్షతన నిర్వహించారు. అంతకుముందు చిన్నగూడూరు మండల కేంద్రంలో దాశరథి సంస్మరణ సభ నిర్వహించారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్, కవి, రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మురళీనాయక్, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ)రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీతోపాటు కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, ఉద్యమకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దాశరథి సోదరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాశరథి చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కళాకారులు తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ.. మహానీయుడి స్వగ్రామం చిన్నగూడూరును సందర్శించి వేడుకల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఉద్యమ శక్తిగా, వేదాల అనువాదకుడిగా, సినీగేయ రచయితగా దాశరథి కీర్తి హిమాలయ శిఖరమంత ఎత్తుకు ఎదిగిందని గుర్తు చేశారు. అనంతరం చిన్నగూడూరు నుంచి బైక్ ర్యాలీగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘తెలంగాణ అంటే దాశరథి.. దాశరథి అంటే తెలంగాణ’ అనేలా కృషి చేశారని గుర్తు చేశారు. అద్భుతమైన పద్యాలు, పాటలు, కవితలతో సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ‘ఈ నేల, ఈగడ్డే కాదు ఈ దేశం రైతులదే’ అని ఎలుగెత్తి చాటాడాని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనపై వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేసిన దాశరథి కృష్ణామాచార్య చరిత్ర భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని కోరారు. చిన్నగూడురు మండలానికి దాశరథి మండలంగా నామకరణం చేయడంతోపాటు దాశరథి పేరిట లైబ్రరీ, కాంస్య విగ్రహం, స్మృతివనం ఏర్పాటు, ఏడాదిపాటు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు ఎమ్మెల్సీ రవీందర్రావు ముందుకు వచ్చారని, ప్రభుత్వ సహాయంతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో దాశరథి సేవలు భావితరాలకు గుర్తిండిపోయేలా చేస్తాననడం అభినందనీయమని ఎమ్మెల్సీని కొనియాడారు. ప్రజలను బానిసలుగా చూడటం, చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయించడం, రైతు, రైతుకూలీల కష్టనష్టాలను వేయి కన్నులతో పరిశీలించి వారి కన్నీటిని కలం గుండెల్లో నింపుకొని కవితలు రాశాడని గుర్తు చేశారు.
రెండు రాష్ర్టాల్లో ఉత్సవాలు నిర్వహించాలి
దాశరథి కేవలం తెలంగాణకే చెందిన కవి కాదు.. ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రజాకవి. ఆయన శతజయంత్యుత్సవాలను రెండు రాష్ర్టాల్లో నిర్వహించేలా ఆయా ప్రభుత్వాలు కృషి చేయాలి. నిజాం దాష్టికాలను చూసి చలించిన దాశరథి తన పద్యాల రూపంలో ఆయనపై నిప్పులు చెరిగేవారు. చిన్నగూడురుకు చెందిన ఒక దొర దాశరథిని చంపాలని చూస్తే వెళ్లి గార్లలో ఉన్నారు. అక్కడ కూడా వారి అరాచకాలపై గర్జించిన సింహం దాశరథి. దాశరథి ప్రజల కోసం పడ్డ కష్టాలు అన్ని ఇన్నీ కావు. ఆయన ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి.
– నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు
భావితరాలకు తెలిసేలా కార్యాచరణ
నిజాం నిరంకుశ పాలనపై అవిశ్రాంత పోరాటం చేసి తన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన దాశరథి కృష్ణమాచార్యుల చరిత్రను దేశవ్యాప్తం చేయాలి. భూస్వాములు పెత్తందార్లకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన ఘనుడు దాశరథి. ఈ గడ్డపై అణువణువు దాశరథి జ్ఞాపకాలు నిండుకుని ఉన్నాయి. తొలి తెలంగాణ ఉద్యమంలో అతని పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం. ఆ మహనీయుడి శతజయంతి వేడుకలను సంవత్సరమంతా నిర్వహిద్దాం. ఆయన పుట్టిన ఈ గడ్డకు దాశరథి చిన్నగూడూరుగా నామకరణం చేసేందుకు, గ్రంథాలయం, దాశరథి స్మృతివనం ఏర్పాటుకు గ్రామస్తులు ఆసక్తిగా ఉన్నారు.
– రవీందర్రావు, ఎమ్మెల్సీ, దాశరథి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

