MLA Vivekananda | కొత్త నాటకానికి తెరతీసిన సీఎం రేవంత్: ఎమ్మెల్యే వివేకానంద
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు చెరో ఎనిమిది సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకురాలేకపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda) ఆగ్రహం వ్యక్తచేశారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) విమర్శించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్లు ఇచ్చి తెలంగాణకు ఒక్క రూపాయ కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రెండు జాతీయ పార్టీల ఎంపీలను ఇక్కడి నుంచి గెలిపస్తే ఒక్క పైసా తేలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే వివేకానందతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పారు. బడ్జెట్‌పై కాంగ్రెస్, బీజేపీలను సభలో నిలదీస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చి ఆరు గ్యారంటీలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, ఎక్కడ చేశారని ప్రశ్నించారు. సిగ్గులేకుండా పేపర్లలో యాడ్ ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు చెరో ఎనిమిది సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకురాలేకపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda) ఆగ్రహం వ్యక్తచేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నిధులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టింది, అయినా స్వశక్తితో తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి పదేండ్ల నుంచి ఒక్క పైసా ఇవ్వడం లేదని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి అనేక వాగ్దానలు చేశారని, ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపాడని విమర్శించారు. బడ్జెట్‌కు ముందు 18 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి.. బీజేపీ కేంద్ర మంత్రులను కలిశారని, అయినా రాష్ట్రానికి ఒక్కపైసా రాబట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటూ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలను ఎదుర్కోవడం బీఆర్ఎస్కు కొత్త కాదని చెప్పారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని విమర్శించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ హక్కులు కోసం మాట్లాడారు, మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హక్కుల కోసం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

