టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు | టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు.

తిరుపతి : టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కల్వకుంట్ల విద్యాసాగర్ చేత టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా..ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
భగవంతునికి సేవ చేసే భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామి వారి కీర్తిని నలుమూల వ్యాప్తి చేయడంలోనూ, సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించడంలో తన వంతు కృషి చేస్తానని విద్యాసాగర్ రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి..
Crime News | నల్లగొండ జిల్లాలో 120 కిలోల గంజాయి పట్టివేత
Farmer Died : ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
Rain Alert | తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వానలు..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. ‘మాజీ భార్య’ ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

