సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తిచేస్తా..
సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయడమే తన సంకల్పమని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని గట్టుమీది గ్రామాలైన హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్, కాద్లాపూర్ తదితర గ్రామాలకు సాగునీరు అందించేందుకు సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తి చేస్తానని స్పష్టంచేశారు.
- ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఊరుకోను
- మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ రూరల్, జూన్ 8: సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయడమే తన సంకల్పమని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని గట్టుమీది గ్రామాలైన హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్, కాద్లాపూర్ తదితర గ్రామాలకు సాగునీరు అందించేందుకు సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తి చేస్తానని స్పష్టంచేశారు. బాన్సువాడ మండలం కోనాపూర్‌లో రూ.12 కోట్లతో నిర్మించనున్న గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు పోచారం శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.200 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు చేపట్టామని, కొందరి వల్ల ప్రస్తుతం పనులు నిలిచిపోయాయని తెలిపారు. పనులు చేపట్టేందుకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రిజర్వాయర్ పనులు పూర్తి చేయడమే తన సంకల్పమని ప్రకటించారు.
గతంలో 230 ఉన్న గురుకులాలను 1120కి పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో పని చేశానని, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలతోపాటు నర్సింగ్ కాలేజీ, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల సహా నియోజకవర్గంలో అన్ని రకాల విద్యాలయాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. కేసీఆర్ కృషితో కోనాపూర్- హన్మాజీపేట్ గ్రామాల మధ్య గిరిజన గురుకుల పాఠశాల మంజూరైందని తెలిపారు. విద్యార్థినులకు శాశ్వత భవన నిర్మాణం కోసం రూ.12 కోట్లు మంజూరు చేశామని, పనులను త్వరితగతంగా చేపట్టి విద్యార్థులకు భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాగా కోనాపూర్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని సంగోజీపేట్కు చెందిన ఆర్మీ జవాన్ రాసాలం మహేశ్ సన్మానించారు. ‘సార్ మీ కృషి, మీ కుమారుడు పోచారం భాస్కర్‌రెడ్డి’ సహకారంతో ఆర్మీ జవాన్ ఉద్యోగం సాధించినట్టు పేర్కొన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

