MLA Rajaiah | కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదు : ఎమ్మెల్యే టి.రాజయ్య
MLA Rajaiah | ముఖ్యమంత్రి కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని, ఆయన ఆదేశాలను పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడారు. బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను వీర విధేయుడిడని అన్నారు.
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 22 : ముఖ్యమంత్రి కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని, ఆయన ఆదేశాలను పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడారు. బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను వీర విధేయుడిడని అన్నారు.
తన స్థాయికి తగ్గకుండా అవకాశం కల్పిస్తానని, ఇప్పటికంటే ఉన్నతంగా చూస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటించాలని, సీఎం ఆశీస్సులు మెండుగా ఉంటాయని అన్నారు.
బహిరంగ సభను విజయవంతం చేద్దాం
అక్టోబర్ 16న నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం దేవన్నపేట గ్రామ సమీపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని, బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పని చేసి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు చూచించారు. త్వరలోనే నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేస్తానని అన్నారు. అలాగే స్టేషన్ ఘన్ పూర్‌ను మున్సిపాలిటీగా చేసుకోవడం, నియోజకవర్గ కేంద్రంలో అమరవీరుల స్తూపాన్ని పూర్తి చేయాల్సి ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM KCR
- MLA Rajaiah
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

