Pocharam Srinivas Reddy | కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్కు 16 పార్లమెంటు సీట్లు ఖాయం : పోచారం శ్రీనివాస్ రెడ్డి
Pocharam Srinivas Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని మాజీ స్పీకర్ ,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని మాజీ స్పీకర్ ,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు. బీఆర్ఎస్ భవన్లో ఆదివారం జహీరాబాద్(Zaheerabad )పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సంఖ్యా పరంగా కాంగ్రెస్ గెలువొచ్చు ..కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్లో ఎవరు సమర్థులు ఉన్నారని ప్రజలు ఓట్లు వేశారు? కార్యకర్తలది తప్పు కాదు నాయకులుగా మనమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. బీఆర్ఎస్ కున్న కేడర్ మరే పార్టీ కి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎం కానందుకు ప్రజలు బాధపడుతున్నారని, కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్కు 16 పార్లమెంటు సీట్లు రావడం కష్టమేమి కాదన్నారు. గ్రూపు తగాదాలకు స్వస్తి పలికి సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

