జమ్మికుంట, ఆగస్టు 19: ‘ఇరవై ఏళ్లుగా ఇక్కడి దళిత, బహుజనులను ఇబ్బందులకు గురి చేసినవ్. పార్టీని నిర్వీర్యం చేసేందుకు అభివృద్ధి చేయలేదు. కన్నతల్లిలాంటి పార్టీని మోసం చేసినవ్. సీఎం కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచేందుకు కుట్రలు పన్నినవ్. రెండేళ్ల కిందట్నుంచే బీజేపీతో చేతులు కలిపినవ్’ అని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను పరిగతో పోల్చాడని, దళిత బంధును అవహేళన చేశాడని విమర్శించారు. దళిత, బహుజనుల భూములు లాక్కున్న ఈటల రాజేందర్ లెఫ్టిస్టో.. సోషలిస్టో కాదని, ఆయనో పెద్ద కరెప్షనిస్టు అని మండిపడ్డారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని లయోలా స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో పదవులన్నీ అనుభవించి, పార్టీకి ఎందుకు రాజీనామా చేశావో..? చెప్పాలని ఈటలను డిమాండ్ చేశారు. సన్నాసులుండే పార్టీలో చేరాడని, ఆస్తులు, అధికారం కోసం ఆరాటపడుతున్నాడని ధ్వజమెత్తారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, జమ్మికుంట అర్బన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.