మేడ్చల్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): పబ్లిక్ ఇంకా కాంగ్రెస్‌ను నమ్ముతలేరు.. పార్టీలో సిస్టం లేదు.. పార్టీ కుప్ప అయిపోతది’ అంటూ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని గెస్ట్‌హౌస్‌లో రెండు రోజుల క్రితం మైనంపల్లి తన అనుచరులతో మాట్లాడిన మాటాలు సోషల్‌మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ‘పార్టీ ఇంకా పికప్ అయితలేదు.. నాకు పర్సనల్ ఏమీలేదు.. మీరు గెలవాలే.. అందరూ మంచింగుండలే.. నేను నా కొడుకు లెటర్ ఇచ్చినట్టయితే నర్సారెడ్డినే ముందర్న తిడుతా.. చక్రధర్‌గౌడ్‌కు లెటర్ ఎట్ల్లా ఇస్తరు? నిన్న మెన్న వచ్చిండు..’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.