చిన్నారెడ్డిపై ఖర్గేకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చి న్నారెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఏఐసీసీ వద్దకు చేరింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మేఘారెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చి న్నారెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఏఐసీసీ వద్దకు చేరింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మేఘారెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవల తనపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖర్గేకు ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు.
తాను డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుగోలు చేశానని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్టు మేఘారెడ్డి వెల్లడించారు. పత్రికల్లో వచ్చిన రిపోర్ట్‌తో పాటు చిన్నారెడ్డి వాయిస్‌ను కూడా ఖర్గే ముందు ఉంచినట్టు తెలిపారు. 9 సార్లు బీఫామ్ ఇచ్చిన కన్నతల్లి వంటి పార్టీపైన చిన్నారెడ్డి విమర్శలు చేశారని మేఘారెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలతో కలిసి పార్టీని నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీరును అధిష్ఠానం ముందు ఉంచినట్టు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

