Makkan Singh | ఎవడైనా అడ్డంగా మాట్లాడితే.. నరుకుతం.. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Makkan Singh | రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Makkan Singh | పెద్దపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)/మంథని: రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుపాటు రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదికపై మక్కాన్ సింగ్ మాట్లాడుతూ.. ‘మంత్రి శ్రీధరన్న ఇక్కడ ఉండక పోవచ్చు. రెండు గంటల్లో ఇక్కడ ఉన్న మేం (తనతోపాటు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చింతకుంట విజయరమణారావును చూపిస్తూ) ముగ్గురం ఒక్క క్షణంలో వస్తం. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రశాంతంగా ఉన్న జిల్లా రాజకీయాల్లో ఆయన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రౌడీ రాజ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరికేస్తామనడంపై ప్రజాస్వామికవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
ఇటీవల అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మా దగ్గర కండలు తిరిగిన పహిల్వాన్లు ఉన్నరు. రాజ్ ఠాకూర్ ఉన్నడా?’ అంటూ రామగుండం ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే మక్కాన్ సింగ్‌ను ఉసిగొలిపి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మక్కాన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఎంతమాత్రం మంచిది కాదని, వెంటనే వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలే గానీ, ఇలా అడ్డంగా నరికేస్తామంటూ మాట్లాడుతారా? అని ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని హితవు పలుకుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

