Kalvakuntla Sanjay | మీకు పాదాభివందనం చేస్తాం. దయచేసి మక్కలు కొనండి అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అధికారులను వేడుకున్నారు. కొన్ని రోజులుగా కల్లాల్లోనే మక్కలు పేరుకుపోవడం, వర్షాలకు తడిసి ముద్దవుతుండంతో ఆయన మక్కజొన్న కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ డీఎంకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సంజయ్ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మొక్కజొన్న కొనుగోలు విషయంలో గత నాలుగు వారాలుగా జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. లారీలు పంపించండి.. నేను మోస్తా, లేదంటే మా కార్యకర్తలను మోస్తారని అధికారులకు సూచించారు. మీరు అర్జెంటుగా లారీలు పంపించండని ఎమ్మెల్యే కోరారు. ఈ క్రమలో మహిళా రైతులు ఎమ్మెల్యే కాళ్ల మీద పడి తమ గోడును వెల్లబోసుకున్నారు.
మీకు పాదాభివందనం చేస్తాము దయచేసి మక్కలు కొనండి
మక్కజొన్న కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ డీఎంకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల… pic.twitter.com/xZdjVp3Y2V
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026