Harish Rao | కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింత.. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్
arish Rao | రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో... దీంతోనే స్పష్టం అవుతోంది. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. రాజకీయాల కోసం మాట్లాడడం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. మేధావులు మౌనం వీడాలి అని హరీశ్‌రావు కోరారు.
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలనే పేర్కొంటూ జనవరి 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇవాళ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మీడియా ముందు ప్రకటించారు. 27వ తేదీన రాసిన లేఖ ప్రామాణికమా? ఇవాళ్టి మీటింగ్‌లో అంగీకారం ప్రామాణికమా? అని హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మరి ఇవాళ ఏం జరిగింది?
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించారని తాను చెబితే హరీష్ రావు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తామని గొప్పగా చెప్పారు. మరి ఇవాళ ఏం జరిగింది? శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి. వేసవిలో, రేపు అవసరం పడినపుడు తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా? జలవిద్యుత్ హౌస్‌ల గురించి చర్చ లేదని చెప్తున్నారు కానీ, నీరు లేకుండా విద్యుత్ ఎలా వస్తుంది? బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు.
మరి ఇవాళ ఏం జరిగింది?
బోర్డు అనుమతి లేనిదే రాష్ట్ర ఇంజనీర్లు, అధికారులు కనీసం ప్రాజెక్టుల వద్దకు వెళ్ళే పరిస్థితి ఉండదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం, ఏపీ చేతిలో పెట్టడమా? కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టిన ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా? అని నిలదీశారు. అందరితో చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ ఎలా అంగీకరించింది? ప్రశ్నించారు. ప్రాజెక్టులు అప్పగించబోమని ఓ వైపు చెబుతారు… మరోవైపు మీటింగుల్లో అధికారులు అంగీకరించి వస్తారని హరీశ్‌రావు విమర్శించారు.
రాజకీయాల కోసం మాట్లాడడం లేదు..
శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు… ఇవాళ ఈఎన్సీ కృష్ణా బోర్డు మీటింగ్‌కు వెళ్లి ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించి వచ్చారు. 2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో… దీంతోనే స్పష్టం అవుతోంది. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. రాజకీయాల కోసం మాట్లాడడం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. మేధావులు మౌనం వీడాలి అని హరీశ్‌రావు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

