Harish Rao | భేషజాలకు పోవద్దు బిల్లులివ్వండి.. పాఠశాలలను నిర్లక్ష్యం చేయొద్దు: హరీశ్‌రావు
ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
- జవాబుల కోసం సమస్యల్ని దాటేయొద్దు
- వాస్తవాల తగ్గట్టు నిర్ణయాలు తీసుకోండి
- సర్కారుకు హరీశ్‌రావు సూచన
Harish Rao | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పాఠశాలల నిర్వహణను గాలికి వదిలేయడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎదురొంటున్న ఇబ్బందుల గురించి లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అసలు సమస్యలే లేవన్నట్టు విద్యాశాఖ ప్రకటించడం సరికాదని, తన లేఖపై భేషజాలకు పోయి, సమాధానాలిచ్చేందుకు సమస్యలను దాటవేయొద్దని సూచించారు. సమసలు పరిషరించకుండా వాస్తవాలను పకనబెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నష్టం జరుగుతున్నదని ధ్వజమెత్తారు. విద్యాశాఖలో రాష్ట్రవ్యాప్తంగా సమస్యలున్నాయని నిర్ధారించేందుకు సోమవారం తన నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలను విద్యాశాఖ దృష్టికి తెచ్చారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కారానికి డిమాండ్ చేశారు.
ఇవీ సమస్యలు
- కుక్ కం హెల్పర్లకు చెల్లించే రూ.3 వేల గౌరవ వేతనాలు గతేడాది డిసెంబర్ వరకే వచ్చాయి. 2024 జనవరి, ఫ్రిబవరి, మార్చి, ఏప్రిల్, జూన్‌కు సంబంధించి వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
- 9, 10వ తరగతి మధ్యాహ్న భోజన బిల్లులు 2024 జనవరి వరకే వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
- 1-8వ తరగతి వరకు బిల్లులు 2024 ఏప్రిల్ వరకే వచ్చాయి. జూన్ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
- కోడిగుడ్డు బిల్లులు 2024 జనవరి వరకే వచ్చా యి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
- సర్వశిక్ష అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల (ఐఈఆర్పీ) వేతనాలు 2024 మే వరకే వచ్చాయి. మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి.
- గతంలో గ్రామ పంచాయతీలే పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టేవి. ఈ బాధ్యతను ‘అమ్మ’ కమిటీలకు అప్పగిస్తామన్న మాట ప్రకటనకే పరిమితమైంది. వెంటనే ప్రతిస్కూల్కు నెలకు 10 వే లు విడుదల చేసి, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలి.
- సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని సహృదయంతో పునఃప్రారంభించాలి.
- పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామన్న హమీ మాటలకే పరిమితమైంది. అధికారిక ఉత్తర్వుల్లేక పాఠశాలల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే ఉత్తర్వులివ్వాలి.
- ఎస్జీటీ నుంచి సూల్ అసెస్టెంట్లుగా ప్రమోషన్లిచ్చిన నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 9వేల ఖాళీలు ఏర్పడ్డాయి. డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తయ్యేలోగా పిల్లలకు విద్యాబోధన అందేలా వలంటీర్లను నియమించాలి.
- గతేడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రీమెట్రిక్ సాలర్ షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

