Sanjay Kalvakuntla | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బ్లాక్ టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లని పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఆపడం అనరు, తోస్తున్నారు..మోగోడివైతే ముందుకురా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో అసెంబ్లీకి హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ నల్ల టీషర్ట్ ధరించి అసెంబ్లీకి బయలుదేరగా పోలీసులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించి అడ్డుకున్నాడు.
పోలీసుల తోపులాటపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫైర్
దీన్ని ఆపడం అనరు.. తోస్తున్నారు
మోగోడివైతే ముందుకురా అంటూ తీవ్ర ఆగ్రహం https://t.co/Z7uoVl5TwM pic.twitter.com/4I0cErS7Yf
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026