MLA Balu Naik | మంత్రి పదవికి నేను కూడా పోటీలో ఉన్నా : ఎమ్మెల్యే బాలు నాయక్
MLA Balu Naik | మంత్రి పదవిపై దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నోరు విప్పారు. తాను కూడా మంత్రి పదవికి పోటీలో ఉన్నానని బాలు నాయక్ పేర్కొన్నారు.
MLA Balu Naik | హైదరాబాద్ : మంత్రి పదవిపై దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నోరు విప్పారు. తాను కూడా మంత్రి పదవికి పోటీలో ఉన్నానని బాలు నాయక్ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో బాలు నాయక్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఇప్పటి వరకు తమ సామాజిక వర్గానికి చోటు లభించలేదు. కాంగ్రెస్ ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కేబినెట్లో మా వాళ్లు లేరు అనే అసంతృప్తితో తమ సామాజికవర్గం వారు ఉన్నారు. కేసీఆర్ హయంలో మా సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం లభించింది. తమ సామాజిక వర్గానికి కేసీఆర్ ఎక్కడా అన్యాయం చేయలేదు.. అయినా కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు ఓట్లు వేశారు అని బాలు నాయక్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు లంబాడీలకు మంత్రి పదవి దక్కలేదు. అధిష్టానం, సీఎం రేవంత్ మంత్రి పదవి విషయంలో సానుకూలంగా ఉన్నారు. మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. నేను కూడా పోటీలో ఉన్నా. నాకు డిప్యూటీ స్పీకర్, మావాళ్లకు ఇంకో ఏదో పదవి ఇస్తే కాదు.. కేబినెట్లో బెర్త్ కావాలని డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాలకు చెందిన ఏ గిరిజన నాయకుడికి కూడా మంత్రి పదవి దక్కలేదు అని బాలు నాయక్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

