వేతనాల కోసం భగీరథ కార్మికుల ఆందోళన
వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు బైఠాయించారు.
- ఎల్అండ్టీ అధికారుల నిర్బంధం
- నిలిచిన తాగునీటి సరఫరా
తిరుమలాయపాలెం, జూలై 16 : వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు బైఠాయించారు. ఏజెన్సీ కంపెనీ ఎల్అండ్టీ వారు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు.
అక్కడికి వచ్చిన ఎల్అండ్టీ కంపెనీ జిల్లా మేనేజర్ ఎల్కే రెడ్డి, ఇద్దరు అధికారులను కార్యాలయ ఆవరణలో నిర్బంధించారు. కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.19 వేల జీతం ఇస్తుంటే ఎల్అండ్టీ కంపెనీ, అధికారులు కుమ్మక్కై రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. జీతాల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని మేనేజర్‌ను నిలదీశారు.
ప్రభుత్వం నుంచి కంపెనీకి బిల్లులు వచ్చేవరకు స్పష్టత ఇవ్వలేమని మేనేజర్ వారికి తెలిపారు. దీంతో వేతనాలు ఇచ్చేవరకు విధులను బహిష్కరిస్తామని వారు ప్రకటించారు. విషయం తెలుసుకున్న తిరుమలాయపాలెం ఎస్సై గిరిధర్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని కార్మికులతో మాట్లాడటంతో మేనేజర్, అధికారులను వదిలేశారు. మిషన్ భగీరథ కార్మికులు విధులను బహిష్కరించడంతో మండలంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

