ఏజెన్సీ ముసుగులో వేతనాల్లో కోత!.. సిద్ధమైన తెలంగాణ సర్కార్?
మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు విధించేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, హౌస్ కీపింగ్ ఉద్యోగులను డెయిలీవేజ్ కార్మికులుగా గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం.
- ఆందోళనలో 5వేల మంది మైనారీటీ గురుకుల సిబ్బంది
- ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలకు దూరమయ్యే ప్రమాదం
- రోజువారీ కూలీలుగా మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, హౌస్‌కీపింగ్ ఉద్యోగులు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు విధించేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, హౌస్ కీపింగ్ ఉద్యోగులను డెయిలీవేజ్ కార్మికులుగా గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ శాఖ ఉన్నతాధికారి సూచన మేరకే ఈ విధానాన్ని అమలుచేయాలని నిశ్చయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విధానాన్ని క్రమేణా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల సొసైటీ ల్లోనూ వర్తింపజేసే ప్రమాదమున్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో 5వేల మంది సిబ్బంది
రాష్ట్రవ్యాప్తంగా 204 మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో సుమారు 5000 మంది మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.12వేల నుంచి రూ.19 వేల జీతాలు అందజేస్తున్నారు. కొన్నేళ్లుగా ఏడాదిలో 10 నెలల పనికాలానికే జీతం ఇస్తూ రెండు నెలలు కోత విధిస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక భారం నుంచి తప్పించుకొనేందుకు వీరిని డెయిలీ వేజ్ కార్మికులుగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
అంటే విధులకు హాజరైన పనిదినాలకు మాత్రమే వేతనం చెల్లిస్తారు. అంటే రూ.15 వేల వేతనం తీసుకుంటున్న ఒక ఉద్యోగికి ప్రతిరోజూ రూ.500 వేతనంగా పరిగణి స్తారు. సదరు ఉద్యోగి పనిచేసిన రోజులకే వేతనం చెల్లిస్తారు. అయితే ఏజెన్సీల గుప్పిట్లో నుంచి తప్పించేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా వేతన భారం నుంచి తప్పించుకొనేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఉద్యోగ భద్రతకు ముప్పు
ఔట్సోర్సింగ్ సిబ్బందిని డెయిలీవేజ్ కార్మికులుగా పరిగణించడంద్వారా ఉద్యోగులు తమ హక్కులు కోల్పోవడమే కాక ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యానికి దూరమవుతారు. భవిష్య త్లో పింఛన్, గ్రాట్యుటీ సౌకర్యాలతోపాటు ఉద్యోగ విరమణ అనంతరం ప్రయోజనలు దక్కవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

