Rythu Bharosa | మీరే మాట్లాడుకుంటారా.. మమ్మల్ని మాట్లాడనివ్వరా?.. కాంగ్రెస్ నాయకులపై రైతుల మండిపాటు
‘మీరే మాట్లాడుకుంటారా.. మాకు అవకాశం ఇవ్వరా?’ అని రైతు భరోసా అభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులపై రైతులు మండిపడ్డారు.
- స్టేజీ వద్ద రైతుల ఆందోళన
- రైతులను మాట్లాడకుండా నియంత్రించిన మంత్రులు
- ఉమ్మడి కరీంనగర్లో తూతూ మంత్రంగా ‘రైతు భరోసా’ అభిప్రాయ సేకరణ
Rythu Bharosa | కరీంనగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ‘మీరే మాట్లాడుకుంటారా.. మాకు అవకాశం ఇవ్వరా?’ అని రైతు భరోసా అభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులపై రైతులు మండిపడ్డారు. కార్యక్రమంలో రసాభాస జరగడంతో ఎవరు.. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ శుక్రవారం కరీంనగర్ శివారులోని వీ కన్వెన్షన్‌లో జరిగింది. దీనికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 19 మంది రైతులతో అధికారులు మాట్లాడించారు. రైతులకు ఒక్క నిమిషం సమయం మాత్రమే ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన రైతు నారాయణరెడ్డి మాట్లాడుతూ రియల్ భూములకు రైతు భరోసా ఇవ్వరాదని అన్నారు. పంట సాగుకు ముందే రైతు భరోసా ఇచ్చే రైతులకు ప్రయోజనం ఉంటుందని ఆయన మాట్లాడుతుండగానే మరో రైతును పిలిచి సమయం లేదని చెప్పడం గమనార్హం. ఇలా చాలా మంది రైతులను మధ్యలోనే ఆపేసి పంపించడం కనిపించింది. రైతు భరోసాపై జరిగిన అభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా జరిగిందనే అభిప్రా యం సర్వత్రా వ్యక్తమైంది.
భరోసా అమలు చేస్తాం : మంత్రి తుమ్మల
ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతు భరో సా అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు రుణమాఫీ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రతి హామీని అమలు చేసి తీరుతామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తమది ప్రజాపాలన అని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఐటీ చెల్లిస్తే రుణమాఫీ వర్తించదని, రేషన్ కార్డు ప్రాతిపదిక రుణమాఫీ జరుగుతుందని కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదెకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి సూచించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చింతకుంట విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్‌సింగ్, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

