Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఆలిండియా బిల్డర్ కన్వెన్షన్లో మంత్రు లు పొంగులేటి, కొమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. సీఎం సమక్షంలో మొదట పొంగులేటి మాట్లాడుతూ.. మీ అందరితోపాటు నేనూ, నా కొలీగ్ కోమటిరెడ్డి కూడా కాంట్రాక్టరే’ అని తెలిపారు. అనంతరం కోమటిరెడ్డి ప్రసంగించారు.
మళ్లీ పోడియం ముందుకొచ్చి, సీఎం రేవంత్ అనుమతి తీసుకొని మరీ.. పొంగులేటి వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. ‘మా సోదరుడు, కొలిగ్ మంత్రి పొంగులేటి చెప్పినట్టు నేను కాంట్రాక్టర్ని కాదు. తెలంగాణ ఫైటర్ని. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ సోల్జర్ని. నాకు ఏం వర్కూ లేదు. 35 ఏండ్ల నుంచి నల్లగొండలో అద్దె ఇంట్లో ఉంటున్నాను. హైదరాబాద్లో చిన్న ఇల్లుంది. నాకు ఎలాంటి కాంట్రాక్టులు లేవు. నేను ఎలాంటి బిజినెస్ చేయడం లేదు’ అని స్పష్టం చేశారు. తర్వాత ఒకరికొకరు వేదికపై క్లారిటీ ఇచ్చుకొని, ఎడముఖం, పెడముఖం పెట్టి కార్యక్రమం పూర్తయ్యే వరకూ అలాగే ఉండిపోయారు. వీరిద్దరి వ్యాఖ్యలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్గా మారాయి.