Telangana
- Dec 05, 2020 , 20:00:39
టీఎస్పీఎస్సీ చైర్మన్‌కు మంత్రుల పరామర్శ

కరీంనగర్ : టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాతృమూర్తి జననమ్మ (85) ఇటీవల మృతి చెందింది. శనివారం ఘంటా చక్రపాణి స్వగ్రామం కరీంనగర్ జిల్లా మల్కాపూర్‌లో ఆమె దశదిన కర్మ నిర్వహించారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునిల్ రావు తదితరులు హాజరై జననమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం చక్రపాణితోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జననమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
MOST READ
TRENDING