హైదరాబాద్, ఫిబ్రవరి2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలకులు విస్మరించిన తెలంగాణ బహుజన పోరాట యోధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే విశేష గుర్తింపు లభిస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు గురువారం అధికారులు, గౌడ సంఘాల ప్రతినిధులతో కలిసి మంత్రి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బహుజన పోరాట యోధుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిసేలా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వివరించారు.
ట్యాంక్‌బండ్‌పై పాపన్నగౌడ్ భారీ విగ్రహాన్ని త్వరలో ప్రతిష్ఠించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, టూరిజం ఎండీ మనోహర్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్‌గౌడ్, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ చంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్ఎండీఏ డిప్యూటీ ఈఈ దేవేందర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావుగౌడ్, జై గౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెల్ల వేములయ్యగౌడ్, తెలంగాణ గౌడసంఘాల సమావేశం అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, నాయకులు చింతల మల్లేశంగౌడ్, బత్తిని కీర్తిలతాగౌడ్, రాజయ్యగౌడ్, అశోక్‌గౌడ్, నగేశ్ గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.