Minister Srinivas Yadav | ఆర్థిక సంస్కరణ జాతిపిత పీవీ నరసింహరావు : మంత్రి తలసాని
Minister Srinivas Yadav | దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు పీవీ నరసింహరావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Minister Srinivas Yadav | దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు పీవీ నరసింహరావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్థిక సంస్కరణ జాతిపితగా నిలిచారని కొనియాడారు. పీవీ 102 జయంతి సందర్భంగా పీవీ మార్గ్‌లోని ఘాట్‌లో బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని తెలిపారు. బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరును సాధించారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పీవీ సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ తగినరీతిలో గౌరవిస్తుందని చెప్పారు. పీవీ శత జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేయడమే కాకుండా భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పిన పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వానీదేవి, దైవజ్ఞ శర్మ, ఆర్డీవో వసంత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

