కేటీఆర్ దత్తతతో.. మునుగోడుకు తిరుగులేదు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Minister Srinivas Goud | మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని, దీంతో ఈ ప్రాంతానికి ఇక తిరుగుండదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజీగూడెంలో
లింగోజిగూడెం / చౌటుప్పల్ టౌన్ : మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని, దీంతో ఈ ప్రాంతానికి ఇక తిరుగుండదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజీగూడెంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఆర్ఎస్ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు తమను ఎక్కడ తరుముతారోనని భయపడి ప్రచారం చేపట్టేందుకు ప్రతిపక్షాలు జంకుతున్నాయన్నారు. రైతుబంధు రైతుబీమా, మిషన్ భగీరథ, పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లు అడిగేందుకు వెళితే తమను ఎక్కడ కొడుతారోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే లేనందున ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. భవిష్యత్‌లో తిరుగులేనివిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి చేసేవాళ్లు అధికారంలోకి రావాలో.. కులం మతం పేరిట చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించే వాళ్లు అధికారంలోకి రావాలో జనం జాగ్రత్తగా ఆలోచించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రికి స్థానికులు నీరాజనం పలికారు. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై టీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలువురు నేతలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

