Minister Seethakka | కుమ్రంభీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కాగజ్‌నగర్, జూలై 29: మంత్రి సీతక్క కోఆర్డినేటర్‌నని.. జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు ఇప్పిస్తానని నమ్మించి విద్యార్థుల తల్లిదండ్రల వద్ద ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసి న ఘటన మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
కౌటాల, సిర్పూర్, కాగజ్‌నగర్ మండలాలకు చెందిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్‌కు చెందిన ప్రశాం త్ జ్యోతిబాఫూలే పాఠశాలల్లో సీట్లు ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించేందుకు మంత్రి సీతక్క నుంచి తెచ్చిన ఓ లెటర్‌ను చూపించాడు. గతంలో కొంత మందికి సీట్లు ఇప్పించినట్టు నమ్మించా డు. దీంతో ఇతను చెప్పిన మాటలను నమ్మిన విద్యార్థుల తల్లిదండ్రులు రెసిడెన్షియల్లో సీటు కోసం డబ్బులు ఇచ్చేందు కు అంగీకరించారు.
ఒక్కో సీటుకు రూ. 20 వేల చొప్పున బేరం కుదుర్చుకున్న సదరు వ్యక్తి అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి (సుమారు 26 మంది) వద్ద రూ. 10 వేల చొప్పున అడ్వాన్స్ తీసుకున్నాడు. మిగ తా రూ. 10 వేలు సీటు ఇప్పించిన తర్వా త ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. రెండు నెలలు గడుస్తున్నప్పటికీ సీట్లు రాకపోయేసరికి విద్యార్థుల తల్లిండ్రులు అతడి కోసం వెతికారు. ఫోన్ కూడా పది రోజులుగా స్విచ్ఛాప్ వస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు తమ పిల్లలను తీసుకొని మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చారు. మంత్రి సీతక్క కో ఆర్డినేటర్నని చెప్పుకొని శ్రీకాంత్ తమను మోసం చేశాడని, అతడి మాటలు నమ్మి తమ పిల్లలకు సంబంధించిన టీసీలతోపాటు సర్టిఫికెట్లు తీసుకున్నామని, ఇప్పుడు వేరే పాఠశాలల్లో కూడా తమ పిల్లలను చేర్చలేని పరిస్థితి వచ్చిందని వాపోయారు. కలెక్టర్ లేకపోవడంతో కాగజ్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.