యశ్వంత్‌ను సన్మానించిన మంత్రి సత్యవతి రాథోడ్
మంత్రి సత్యవతి రాథోడ్ | టాంజానియాలో గల కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాకు చెందిన యశ్వంత్, అతని తల్లిదండ్రులు, శిక్షకులను హైదరాబాద్ మంత్రుల నివాసంలో సన్మానించారు.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నది గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వారికి కావాల్సిన వసతులను, ఆర్థిక సహాయాన్ని చేస్తూ వారి లక్ష్యాలను నెరవేర్చడంలో ప్రభుత్వం దోహదపడుతుందన్నారు. టాంజానియాలో గల కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాకు చెందిన యశ్వంత్, అతని తల్లిదండ్రులు, శిక్షకులను హైదరాబాద్ మంత్రుల నివాసంలో సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భవిష్యత్‌లో ఇలాంటి సాహసోపేత పర్వతారోహణలకు సంపూర్ణ తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. కిలిమంజారో పర్వతం అధిరోహించడం కోసం లక్షన్నర రూపాయలు ఆర్థిక సాయం చేయడంతో యశ్వంత్, ఆయన కుటుంబ సభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
జమ్ము కాశ్మీర్ లేహ్ లడక్ ప్రాంతంలోని ఆరు వేల మీటర్ల ఎత్తయిన కహర్ డుమ్లా పర్వతశ్రేణిని, కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రాష్ట్ర ప్రభుత్వ పతాకాన్ని ఎగురవేయడం పట్ల యశ్వంత్‌ను మంత్రి ఘనంగా సన్మానించారు.
ఇవి కూడా చదవండి..
China Education : ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి : మంత్రి హరీశ్‌రావు
Twin Towers: 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కూల్చేయండి : సుప్రీంకోర్టు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

