శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి సత్యవతి పూజలు
మహబూబాబాద్ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని కాకతీయ రాజులు నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి సత్యవతి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

ప్రత్యేక పూజల అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాకతీయుల ఉనికి, పరిపాలనను ప్రజలకు తెలిపే విధంగా కాకతీయ వైభవ సప్తాహంను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి, దర్పణానికి ఎన్నో ఆలయాలు అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయని చెప్పారు. కాకతీయ పాలనలో చెరువుల నిర్మాణానికి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వినియోగించారు. కాలనుక్రమంలో కొందరి నిర్లక్ష్యం కారణంగా పురాతన ఆలయాలు, చెరువులు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో పురాతన ఆలయాలు, చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కాకతీయుల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో చెరువులను అద్భుతంగా తీర్చిదిద్ది వ్యవసాయానికి పెద్ద పీట వేశారని చెప్పారు. కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల చెరువులు ఎండాకాలం సైతం నిండుకుండను తలపిస్తున్నాయన్నారు. ఇనుగుర్తి గ్రామనికి, మండలంగా శుభవార్త త్వరలోనే రాబోతుందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రీ రవి ), ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, కేసముద్రం మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ, ఎంపీపీ చంద్రమోహన్, జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, సర్పంచ్ బిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు కిషన్, యాకుబ్ రెడ్డి, రాహుల్ నాయుడు, ఆర్డీవో కొమురయ్య ఇతర అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

