మన ఊరు-మన బడితో అద్భుతాలు
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, పేదలకు నాణ్యమైన విద్య చేరువైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మన ఊరు-మన బడి తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని అన్నారు.
- సీఎం కేసీఆర్ కృషితో విద్యారంగంలో మార్పు
- 7 వేల కోట్ల రూపాయలతో 25 వేల పాఠశాలల అభివృద్ధి
- గురుకులాలతో కొత్త అధ్యాయం
- విద్యపై చర్చలో మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, పేదలకు నాణ్యమైన విద్య చేరువైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మన ఊరు-మన బడి తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం విద్యపై జరిగిన చర్చకు ఆమె సమాధానం చెప్పారు. మన ఊరు-మన బడి పథకంలో 25,065 పాఠశాలలను రూ.7,289 కోట్లతో మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యంతో మధ్యా హ్న భోజనం పెడుతున్నామని చెప్పారు. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 775 కోట్లలో తెలంగాణ వాటా రూ.672 కోట్లు అని తెలిపారు. వారానికి మూడు గుడ్లు (రూ.307 కోట్లు), రాగి జావకు రూ.32 కోట్లు అదనంగా వెచ్చిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 9వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. రూ.150 కోట్ల ఖర్చుతో రెండు జతల యూనిఫాంలు, రూ. 286 కోట్లతో ఉచితంగా నోట్‌బుక్స్, వర్క్ బుక్స్ ఇస్తున్నామని చెప్పారు.
భారీగా పెరిగిన గురుకులాలు
పేద విద్యార్థులకు కేజీ టు పీజీ నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని అన్నారు. మన ఊరు – మన బడి, ఇంగ్లిష్ మీడియం, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూర్భా స్కూళ్ల ఏర్పాటుతో విద్యారంగం బలోపేతమైందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు 682 గురుకులాలు ఉండగా, వీటిలో 1,94,370 మంది విద్యార్థులు ఉండేవారని, ఇప్పుడు వాటి సంఖ్య 1,517కు పెరగగా విద్యార్థుల సంఖ్య 7,44,759 మందికి పెరిగిందని తెలిపారు. గురుకులాలకు 2023లో రూ. 4049 కోట్లు కేటాయించినట్టు తెలిపా రు. కేజీబీవీల సంఖ్యను 391 నుంచి 495కు పెం చామని తెలిపారు. మాడల్ స్కూ ళ్ల నిర్వహణ భారమైనా సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నార ని చెప్పారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడ ల్ స్కూళ్లలో 8.73 లక్ష ల మంది చదువుతున్నట్టు తెలిపారు. గురుకులాల్లో 11,715 పోస్టులు భర్తీ చేయగా మరో 12, 150 మందిని నియమిస్తున్నట్టు చెప్పారు.
కొత్త కాలేజీలు.. పోస్టుల భర్తీ
దేశ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) 27.3 ఉండగా రాష్ట్రంలో 36.2 శాతం ఉన్నదని, ఈ లెక్కలే రాష్ట్ర విద్యారంగ అభివృద్దికి సూచికలని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తొమ్మిదేండ్లలో 1342 జూనియర్ కాలేజీలు, 85 డిగ్రీ కాలేజీలు, ఐదు పీజీ కాలేజీలు, రెండు లా కాలేజీలు, 4 ఇంజినీరింగ్ కాలేజీలు, ఫారెస్ట్ యూ నివర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ, మహిళా వర్సి టీ, రెండు సైనిక్ స్కూల్స్, 14 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉన్నత విద్యలో 3,232 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని, వర్సిటీల్లో 1,061 పోస్టు లు మంజూరు చేసినా ఆ బిల్లు గవర్నర్ వద్ద ఆగిందని తెలిపారు. పేద విద్యార్థుల విదేశీ చ దువులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 5,653 మందికి రూ. 20 లక్షల చొప్పున వె య్యి కోట్లకు పైగా అందించామని తెలిపారు.
బడ్జెట్ తగ్గింపు వాస్తవం కాదు…
రాష్ట్రంలో విద్యపై బడ్జెట్ తగ్గింపు ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని మంత్రి సబిత చెప్పారు. విద్యారంగానికి 2014-15లో రూ. 9,518 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ. 29,611 కోట్లకు పెంచామని తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలపై మండిపడ్డారు. 2018లో 8,792 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో 3,896 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

