శనివారం 06 జూన్ 2020
Telangana - May 16, 2020 , 01:40:59

నిలకడగా మంత్రి సబిత ఆరోగ్యం

నిలకడగా మంత్రి సబిత ఆరోగ్యం

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: చాతిలో నొప్పితో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ దవాఖానలో చేరిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటం తో శుక్రవారం డిశ్చార్జి చేశారు. గురువారం రాత్రి శ్రీనగర్‌కాలనీలోని తన నివాసంలో ఉన్న సమయంలో స్వల్పంగా చాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను కేర్‌కు తరలించారు. రాత్రంతా అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. సమస్యలేదని డిశ్చార్జి చేశారు.logo