బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలకు 2021 – 22 విద్యా సంవత్సరానికిగానూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ ప్లస్ గ్రేడ్ ఇవ్వడంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వసతులు, బోధన, నిర్వహణ, ప్లేస్మెంట్స్లాంటి అంశాల ఆధారంగా న్యాక్ ప్రతినిధులు ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చారన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ కే పద్మావతి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే, రాష్ట్రంలో ఏ గ్రేడ్ సాధించిన ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సిబ్బందిని, కళాశాల విద్య కమిషనర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి స్కాలర్లు తమ పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పించినట్టు మంత్రి తెలిపారు. విద్యార్థులు చేసే పరిశోధనల్లో సామాజిక కోణం ఉండేలా చూడాలని కోరారు. `