రంగులు మార్చే వాళ్లొస్తరు జాగ్రత్త
వచ్చేది ఎన్నికల కాలమని, ఈ సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చే వాళ్లు వస్తుంటారని, ప్రజలు వాళ్ల మాటలు నమ్మొద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు.
- మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వచ్చేది ఎన్నికల కాలమని, ఈ సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చే వాళ్లు వస్తుంటారని, ప్రజలు వాళ్ల మాటలు నమ్మొద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని రామవరంలో గురువారం ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మాయమాటలు చెప్పి ఓట్లు అడిగేవారిని నమ్మొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్సే మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని తెలిపారు. ప్రభుత్వం కొత్తగూడెం, పాల్వంచలను జంట పట్టణాలుగా అభివృద్ధి చేస్తున్నదని పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. సభలో భద్రాద్రి జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

