Khammam | ఖమ్మం మార్కెట్లో మిర్చికి రికార్డు స్థాయి ధర.. జెండా పాటలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్
Khammam | ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్( Khammam Market )లో తేజ రకం కొత్త మిర్చి( Red Chilli ) కి సోమవారం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. సోమవారం ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో నిర్వహించిన జెండా పాటలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Minister Puvvada Ajay Kumar ) పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు.
Khammam | ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్( Khammam Market )లో తేజ రకం కొత్త మిర్చి( Red Chilli ) కి సోమవారం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. సోమవారం ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో నిర్వహించిన జెండా పాటలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Minister Puvvada Ajay Kumar ) పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. ఖమ్మం మార్కెట్లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది అని పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు చిరునామాగా తీర్చిదిద్దుతామని చిల్లీస్‌కు హబ్‌గా చేస్తామని తెలిపారు. కొన్ని క్వింటాలే కాదు.. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన ప్రతి బస్తాను కొనుగోలు చేస్తారన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం లాభసాటిగా మారిందని, మనం పండించే మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందన్నారు. ఖమ్మంలో చైనా దేశం మిర్చి కంపెనీలను ఏర్పాటు చేసి.. నాణ్యమైన మిర్చిని అక్కడకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉందని, అందుకే రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

