Minister Niranjan Reddy | నమ్మక ద్రోహులకు గుణపాఠం చెప్పండి..పనిచేసే నాయకుడికి మరోసారి అవకాశం ఇవ్వాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి
Minister Niranjan Reddy | ఐదేండ్లు బీఆర్ఎస్(BRS) వెంట ఉండి.. ఎమ్మెల్యే టికెట్ కోసం నమ్మకద్రోహం(traitors )చేసి ఇతర పార్టీలకు వెళ్లిన వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Minister Niranjan Reddy) పిలుపునిచ్చారు.
ఖిల్లాఘణపురం, నవంబర్ 16 : ఐదేండ్లు బీఆర్ఎస్(BRS) వెంట ఉండి.. ఎమ్మెల్యే టికెట్ కోసం నమ్మకద్రోహం(traitors )చేసి ఇతర పార్టీలకు వెళ్లిన వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Minister Niranjan Reddy) పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకపోవడంతో బతుకుదెరువు కోసం వలస వెళ్లి జీవనం సాగించేవారన్నారు.
నేడు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో పెండింగ్, రన్నింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతో బీడుభూములన్నీ పచ్చని మాగాణుల్లా మారాయన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాను కృష్ణానీటితో తడిపామన్నారు. పైరవీలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు నేరుగా చేరుతున్నాయని పేర్కొన్నారు.
ఆయా గ్రామాల్లో పింఛన్లు రాలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆన్లైన్లో వివరాలు నమోదయ్యాయని.. ఎన్నికలు పూర్తయ్యాక పింఛన్లు వస్తాయన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలను, రాష్ర్టాన్ని గాలికొదిలేస్తారని హెచ్చరించారు. ప్రజలు అడిగినా అడగకపోయినా తన దృష్టికి వచ్చిన ప్రతి పనిని చేసి చూపించానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

