హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్కు వైద్యులు సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద పడిపోయాను. దీంతో ఎడమ కాలి మడమకు గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోలు చూడటానికి సలహా ఇస్తారా? అంటూ కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Had a fall today & ended up tearing my ankle ligament. Been advised 3 weeks of rest 🙁
Any advise on binge worthy OTT shows? pic.twitter.com/sWat7eCkWX
— KTR (@KTRTRS) July 23, 2022