నిత్యం ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీగా ఉండే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. అప్పుడప్పుడు సినిమాలు, పుస్తకాలు చదువుతాడనే విషయం అందరికీ తెలిసిందే. అలా ఇటీవలే కేటీఆర్.. ‘గుండెలో వాన అనే కథల పుస్తకాన్ని చదివినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ పుస్తకంలోని కొన్ని కథలను చదివి, నిజంగా కదిలిపోయాను అని కేటీఆర్ పేర్కొన్నారు. మనిషిని వెంటాడే కథలు ఇవి. తెలంగాణ పల్లె జీవితాలను కళ్లకు కట్టినట్టు రాసిన రచయిత పెద్దింటి అశోక్ కుమార్ను కేటీఆర్ అభినందించారు. రెండు దశాబ్దాల సామాజిక చరిత్రను, మార్పులను రికార్డు చేసిన గొప్ప కథలు ఇవి అని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.
‘గుండెలో వాన' పుస్తకంలో కొన్ని కథలు చదివాను. నిజంగా కదిలిపోయాను; మనిషిని వెంటాడే కథలు ఇవి. తెలంగాణ పల్లె జీవితాలను కళ్లకు కట్టినట్టు రాసారు పెద్దింటి అశోక్ కుమార్. రెండు దశాబ్దాల సామాజిక చరిత్రను, మార్పులను రికార్డు చేసిన గొప్ప కథలు ఇవి. పెద్దింటికి అభినందనలు. Congrats Anna pic.twitter.com/sAFxPrXvaY
— KTR (@KTRTRS) August 6, 2021