Minister KTR | నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన..
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో (Minister Prashant Reddy) కలిసి నేరుగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చేరుకుంటారు. తొలుత గుబ్బగుర్తి ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారన్నారు. తర్వాత ఖమ్మం నగరానికి విచ్చేసి లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్, ఎస్బీఐటీ కళాశాల సమీపంలో మున్సిపల్ స్పోర్ట్స్ పార్క్, గోళ్లపాడు చానెల్‌పై నిర్మించిన పార్క్‌లు, వీడివోస్ కాలనీలో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లను ప్రారంభిస్తారన్నారు.
కాల్వొడ్డులోని మున్నేరు వద్ద తీగల వంతెన, నగరంలో పలుచోట్ల డ్రైనేజీ పనులను శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నగరంలో నిర్వహించనున్న ప్రగతి నివేదిన సభలో పాల్గొంటారు. సభ తర్వాత భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం పట్టణానికి మంత్రి కేటీఆర్ చేరుకుని సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభిస్తారు. అనంతరం మీడియో సమావేశంలో మాట్లాడుతారు. అనంతరం సత్తుపల్లికి చేరుకుని పలు అభివృద్ధి పనులను ప్రారంభించి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.
షెడ్యూల్ ఇలా..
- 9.45 గంటలకు లకారం ట్యాంక్ బండ్‌కు చేరుకొని ఎన్టీఆర్ మున్సిపల్ పార్క్‌ను ప్రారంభిస్తారు. అండర్ డ్రైనేజీ మురుగు కాలువ నిర్మాణానికి, అమృత్ పథకం-2 అండర్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
- 10 గంటలకు రామచంద్రయ్య నగర్లో నిర్మించిన కేఎంసీ స్పోర్ట్స్ పార్క్‌ను ప్రారంభిస్తారు.
- 10.15 గంటలకు ప్రకాశ్‌నగర్ చేరుకొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ పార్క్‌ను ప్రారంభిస్తారు. గోళ్లపాడ్ ఛానల్ ఆండర్ గ్రౌండ్ పైపులైన్ నిర్మాణాలను ప్రారంభిస్తారు.
- 10.45 గంటలకు కాల్వొడ్డుకు చేరుకొని మున్నేరు రివర్ ఫ్రంట్ తీగల వంతెనకు, ఆర్సీసీ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
- 11.15 గంటలకు వీడీవోస్ కాలనీకి చేరుకొని సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను ప్రారంభిస్తారు.
- 11.30 గంటలకు కేఎంసీ కార్యాలయానికి చేరుకొని ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న రోడ్లకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు.
- 12 గంటలకు మమత ఆస్పత్రిలోని హెలిపాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్లో భద్రాచలం వెళ్తారు.
భద్రాచలంలో..
- 12.30 గంటలకు భద్రాచలంలోని టొబాకో బోర్డులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు.
- 12.35 గంటలకు హెలిపాడ్ నుంచి బయలుదేరుతారు.
- 12.40 గంటలకు కూనవరం రోడ్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ దగ్గరకు చేరుకొని కరకట్ట నిర్మాణానికి
శంకుస్థాపన చేస్తారు - మధ్యాహ్నం ఒంటిగంటకు అంబేద్కర్ సెంటర్లో ఎస్డీఎఫ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
- 1.15 గంటలకు కేకే ఫంక్షన్ హాల్లో ప్రెస్మీట్లో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 2 గంటలకు సత్తుపల్లికి బయలుదేరుతారు.
సత్తుపల్లిలో..
- మధ్యాహ్నం 2.30 గంటలకు సత్తుపల్లి చేరుకుంటారు.
- 2.35 గంటలకు జ్యోతి నిలయం స్కూల్ దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
- 2.45 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అంబేద్కర్ ఆడిటోరియానికి శంకుస్థాపన చేస్తారు.
- 3 గంటలకు ఎన్టీఆర్ నగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
- 3.15 గంటలకు షాదీఖానాకు, క్రిస్టియన్ భవనానికి, రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
- 3.45 గంటలకు చంద్రా గార్డెన్స్‌లో జరిగే సభలో పాల్గొంటారు.
- 4.50 గంటలకు సత్తుపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

