సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.. కేటీఆర్ ట్వీట్
కేటీఆర్ | అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు

హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకెళుతుంది. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆరేళ్ల కిందటి వరకు పల్లేర్లు మొలిచిన బీడు భూములు ప్రస్తతం పచ్చని పంట పొలాలుగా మారాయి.
అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలతో వేసవిలోనే అప్పర్ మానేరు నిండింది. 2.2 టిఎంసీ ల నీటితో ప్రాజెక్టు జల కళను సంతరించుకొంది. సీఎం కేసీఆర్ కార్యదక్షతతో వానకాలం పంటకు నీళ్ళు వచ్చాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. జూలై మొదటి వారంలో అప్పర్ మానేరు నీటి విడుదలకై ఇరిగేషన్ అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల ప్రాంతం ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నిజం అవుతుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు.
అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
— KTR (@KTRBRS) June 23, 2021
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలతో వేసవిలోనే అప్పర్ మానేరు నిండింది. 2.2 టిఎంసీ ల నీటితో ప్రాజెక్టు pic.twitter.com/9i53kwSiJv
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

