నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని మన రైతులు నిరూపించారు: మంత్రి కేటీఆర్
నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని తెలంగాణ రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని
మెదక్: నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని మన రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని వెల్లడించారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. అనతి కాలంలోనే మిగులు విద్యుత్ సాధించామన్నారు. రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నామని చెప్పారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీసీ అతిపెద్ద పేపర్ మిల్లు తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణపై ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పురి ప్రశంసలు సంతోషం కలిగించాయని చెప్పారు. ఈ ప్లాంటులో గోధుమ పిండి, చిప్స్, బిస్కెట్లు, నూడుల్స్ తయారు చేస్తున్నారని వెల్లడించారు.
నీటి వనరుల్లో విప్లవం సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని నాలుగేండ్లలోనే పూర్తి చేశామన్నారు. 10 టీఎంసీల కాళేశ్వరం నీటిని పరిశ్రమలకు అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. మిషన్ కాకతీయతో 46 వేల చెరువులను బాగుచేశామని, దీంతో వ్యవసాయ స్థిరీకరణ, సాగుపెంపు సాధ్యమైందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులతో సాగువిస్తీర్ణం రెట్టింపయిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గొర్రెలు, మేకల సంఖ్య రెట్టింపయిందన్నారు.
వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విదేశాల నుంచి నూనెల దిగుమతిని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఐటీసీకి ఆసక్తి ఉంటే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పెట్టాలని సూచించారు. ములుగు జిల్లా కమలాపురంలో రేయాన్స్ ఫాక్టరీని టేకప్ చేయాలని కోరారు. పరిశ్రమల వల్ల స్థానికులు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు.
ప్రైవేటు రంగంలో వచ్చే పెట్టుబడులకు ప్రజలు సహకారం అందించాలన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానికంగా వైద్యారోగ్య, విద్యా రంగంలో ఐటీసీ సహకారం అందించాలని, స్థానిక రైతుల నుంచి ముడి పదార్థాలు కొనాలని కోరారు. భూమి కోల్పోయినవారిని ఆదుకునే బాధ్యతపై అందరిపై ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- farmers
- itc
- kaleshwaram
- medak
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

