Minister KTR | ఆక్వా హబ్‌లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తాం: మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల జిల్లాలో (Sircilla) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచలో సబ్‌స్టేషన్ ప్రారంభించారు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ముదిరాజ్ సంఘ భవన్‌కు శంకుస్థాపన చేశారు.
సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల జిల్లాలో (Sircilla) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచలో సబ్‌స్టేషన్ ప్రారంభించారు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ముదిరాజ్ సంఘ భవన్‌కు శంకుస్థాపన చేశారు. గ్రామంలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 350 ఎకరాలలో ఆక్వా హబ్ (Aqua hub) ఏర్పాటు చేయనున్నామని, అందులో స్థానిక పిల్లలకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. చీర్లవంచ (Cheerlavancha) నుంచి వలస పోయినవాళ్లంతా వాపస్ వస్తున్నారని చెప్పారు. గ్రామంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసుకుందామన్నారు.
చీర్లవంచకు త్వరలో ఒక పీహెచ్‌సీని తీసుకొస్తామని, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత లేకుండా చూస్తామని వెల్లడించారు. ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద అర్హులకు రూ.3 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చీర్లవంచలో రూ.12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. దళితులలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించేందుకే దళిత బంధు కార్యక్రమం అమలుచేస్తున్నామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

