ప్రకాశ్ రాజ్ దత్తత గ్రామం అభివృద్ధిపై కేటీఆర్ స్పందన
Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని కేటీఆర్ కొనియాడారు. ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన ఫోటోలను మధుసూదన్ రావు అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా, ఆయన స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం స్ఫూర్తితో 2015, సెప్టెంబర్‌లో షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత గ్రామాభివృద్ధికి ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్, దిమ్మెలను ఏర్పాటు చేశారు. చెట్లను పెంచి గ్రామంలోని వీధులన్నింటిని ఆకుపచ్చగా తయారు చేశారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ప్రకాశ్ రాజ్.
This is the village adopted by @prakashraaj
Great progress made in tandem with local MLA @AnjaiahYTRS Garu 👏 https://t.co/yGfYdloaFT
— KTR (@KTRTRS) September 20, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

