Ktr| కలిసి పనిచేద్దాం… అగ్రగామిగా నిలుద్దాం… కేటీఆర్
Ktr| ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు.

Ktr| ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మరియు వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈరోజు విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కే తారకరామారావు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సాధించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియ పైన దిశానిర్దేశం చేశారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు గారి మార్గదర్శనం, ప్రభుత్వ శాఖాధిపతుల కృషివలన గతంలో అగ్రస్థానంలో నిలిచామని, ఈసారి ర్యాంకుల్లో సైతం అగ్రస్థానంలో నిలిచే కృషి చేద్దామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాల్లో 100% సంస్కరణలు, చర్యలు పూర్తయ్యాయని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు.

ఈసారి రానున్న ర్యాంకులను నిర్దేశించే యూజర్ ఫీడ్ బ్యాక్ అత్యంత కీలకమైన అంశమని, ఈ విషయంలో వివిధ శాఖలకు సంబంధించిన సేవలు పొందుతున్న పారిశ్రామిక వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందని పరిశ్రమల శాఖ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ విధానాలు ఇక్కడి అధికారుల చొరవ వల్ల రాష్ట్రానికి అనేక పెట్టుబడులు విజయవంతంగా వస్తున్నాయని, తద్వారా ఇక్కడ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ విషయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దక్కించుకోవడం ఎంతో దోహదకారిగా నిలిచిందని, ఈసారి సైతం అగ్రస్థానం సాధించుకునేందుకు మనమంతా కలిసి ప్రయత్నం చేద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల కోసం పనిచేయడం కేవలం పరిశ్రమల శాఖ కోసం పని చేయడం మాత్రమే కాదని, తమ తమ శాఖల విభాగాలను బలోపేతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అని కేటీఆర్ అన్నారు. తమ విభాగాలను బలోపేతం చేసుకుంటూనే మనమంతా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం పని చేస్తున్నామనే స్ఫూర్తితో పని చేస్తే ర్యాంకుల్లో మరోసారి అగ్ర స్థానం దక్కడం ఖాయమని ఈ దిశగా పని చేద్దాం అన్నారు.
వివిధ శాఖలకు సంబంధించిన 300కు పైగా సంస్కరణలు, చర్యలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆయా శాఖల వారీగా మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో లో వివిధ శాఖల విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

