Minister KTR | కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
మంత్రి కేటీఆర్ (Minister KTR) వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) యంగ్వన్ కంపెనీ (Youngone company) ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Evertop Textile pvt.limited) పేరుతో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
వరంగల్: మంత్రి కేటీఆర్ (Minister KTR) వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో (Kakatiya Mega Textile Park) యంగ్వన్ కంపెనీ (Youngone company) ఎవర్ టాప్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Evertop Textile pvt.limited) పేరుతో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం కంపెనీ ప్రతినిధులు, పార్కులో వస్త్ర పరిశ్రమలను నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో టెక్స్టైల్ పార్కుకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి, యంగ్వన్ కంపెనీ ప్రతినిధులు స్వాగతం పలికారు.
టీఎస్ఐఐసీ టెక్స్టైల్ పార్కులో యంగ్వన్ కంపెనీకి ఇటీవల 298 ఎకరాలను కేటాయించింది. తమ వస్త్ర పరిశ్రమల్లో 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించనున్నట్లు సౌత్‌కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. యంగ్వన్ కంపెనీ టెక్స్టైల్ పార్కులో రూ.840 కోట్ల పెట్టనుంది.
అనంతరం మంత్రి కేటీఆర్ ఖిలావరంగల్‌కు వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ) నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్ బెడ్రూం ఇండ్లను, వరంగల్‌లో రూ.135 కోట్లతో చేపట్టిన 16 స్మార్టు రోడ్లను కేటీఆర్ ప్రారంభిస్తారు. రూ.75 కోట్లతో వరంగల్ మోడల్ బస్‌స్టేషన్, రూ.313 కోట్లతో ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్లో జరుగనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mississippi Plane Crash | మిస్సిసిపీ తీరంలో కూలిన విమాన ప్రమాదం.. ఆరుగురు గల్లంతు
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ‘ఈథా’పై నెట్టింట విమర్శలు.. డైలాగ్ డెలివరీపై నెటిజన్ల అసంతృప్తి!
Allu Arjun | శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ సందడి.. ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, స్నేహారెడ్డి, అర్హ, అయాన్.. !
Vishwak Sen | 21 ఏళ్లకే ప్రేమించిన అమ్మాయి దూరమైంది.. అప్పులు చేసి మరీ ఛాన్స్ కోసం తిరిగాను : విశ్వక్ సేన్
Tharun Bhascker | మోకాళ్ల మీద పడి సార్, మేడమ్ అని పిలవను.. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు: తరుణ్ భాస్కర్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

