Minister KTR | ఉప్పల్‌లో స్కైవాక్ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ (Uppal) చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్‌ను మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు.
Minister KTR | హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ (Uppal) చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్‌ను మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ.36.50 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ (HMDA) దీనిని నిర్మించింది. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. ఈ స్కైవాక్‌ను నిర్మించారు.

Uppal Skyway
8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
స్కైవాక్ టవర్‌తోపాటు ఉప్పల్ భగాయత్‌లోని శిల్పారామంలో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

