Minister KTR | సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. తంగళ్లపల్లిలో సబ్‌స్టేషన్ ప్రారంభం
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు.
సిరిసిల్ల: సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ కమ్మూనిటీ భవన్, రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురి నుంచి వినపత్రాలు స్వీకరించిన మంత్రి కేటీఆర్, యువకులతో కలిసి సెల్ఫీలు దిగారు.
లక్ష్మీపూర్‌లో పల్లె దవాఖానను ప్రారంభించిన తర్వాత పాపయ్యపల్లె చేరుకుంటారు. రూ.26 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. గోపాల్‌రావుపల్లె, మండెపల్లిలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తంగళ్లపల్లిలోని పీహెచ్సీలో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు గండిలచ్చపేటకు చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తర్వాత కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించనున్నారు.

దళితబంధు పథకం కింద మంజూరైన పౌల్ట్రీఫాంను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుంటారు. మండలంలోని దుమాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత చిట్టివాగుపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించిన గౌడ సంఘ భవనం, రూ.10 లక్షలతో మహిళా సంఘ భవనం, చిట్టివాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభిస్తారు.

యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లన్న పట్నాలకు హాజరు కానున్నారు. అక్కడి నుంచి 3.30 గంటలకు బుగ్గరాజేశ్వర తండా చేరుకొని రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.9.60లతో నిర్మించిన గిరిజన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాచర్ల గుండారంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 5 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించడానికైనా రెడీ.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!
Washington hair | అమెరికా తొలి అధ్యక్షుడి జట్టు వేలం.. మూడు వెంట్రుకల ధర 3.7 లక్షలు..!
Mysaa | రష్మిక మందన్న ‘మైసా’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న రావడం లేదని మేకర్స్ ప్రకటన!
Vijay and Sangeetha | అనిరుధ్, కావ్య గ్రాండ్ రిసెప్షన్.. వేర్వేరుగా వచ్చి జంటను ఆశీర్వదించిన సీఎం విజయ్, సంగీత!
SRK | 9 ఏళ్ల వయసులో కసబ్‌పై సాక్ష్యం చెప్పే ధైర్యం ఎలా వచ్చింది?.. 26/11 బాధితురాలిని ప్రశ్నించిన షారుఖ్ ఖాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

