Minister KTR | హుస్నాబాద్ చేరుకున్న మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ పాల్గొన్నారు.
సిద్దిపేట: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఇండోర్ స్టేడియం, డిగ్రీ కాలేజీ, ఎస్టీ బాలికల హాస్టల్ ప్రారంభించారు. లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ పాల్గొన్నారు. ఉదయం 11.35 గంటలకు డిపో గ్రౌండ్లో భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ నం, 2.30 గంటలకు హుస్నాబాద్ నుంచి హనుమకొండ పర్యటనకు వెళ్తారు.
హనుమకొండలో రూ.181 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.5.20 కోట్లతో నిర్మించిన మాడల్ వైకుంఠధామం, సైన్స్ పార్లను ప్రారంభిస్తారు. తెలంగాణ స్టేట్ సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.8.50 కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్ భవనాన్ని ప్రారంభిస్తారు. రూ.128 కోట్లతో 17 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

Ktr 1
మధ్యాహ్నం 3 గంటలకు హసన్‌పర్తి కిట్స్ కాలేజీలో ఇన్నోవేషన్ హబ్‌ను, సాయంత్రం 4.30 గంటలకు హనుమకొండలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

