చిన్నారి ప్రాణానికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ | ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వింత జబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారి

హైదరాబాద్ : ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వింత జబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన ఓ చిన్నారి వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నది. వారి తల్లిదండ్రులు వ్యాధి నయం చేయించేందుకు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఈ జబ్బును నయం చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడుతుందని వైద్యులు చెప్పారు. కానీ ఆ చిన్నారి తల్లిదండ్రుల వద్ద అంత డబ్బు లేక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఈ విషయాన్ని ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చాడు.
వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ పాపకు ఆపరేషన్ చేయిస్తానని.. వ్యాధి పూర్తిగా తగ్గే వరకు పూర్తి సహకారం అందిస్తానని భరోసానిచ్చారు. పాప అనారోగ్య సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు కేటీఆర్. చెప్పిన విధంగానే వైద్యులు గురువారం పాపను పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు.
I was in pain just looking at the photo of the child. Wonder how she is holding up 🙏
— KTR (@KTRBRS) June 10, 2021
Will personally handle the issue and get the little one best medical care. Thanks for bringing this to my attention @KTRoffice please coordinate https://t.co/FAiDd14OLP
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

