తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్
హైదరాబాద్ : తెలంగాణకు భారీగా పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం డిప్లమాట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. హైదరాబాద్ టీ హబ్ 2.0 లో జరిగిన ఈ సమావేశానికి 50 దేశాలకు చెందిన రాయబారులు, డిప్లమాట్స్, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సుల్ జనరల్స్, హై కమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు.
తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలపై ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన పలు కంపెనీలకు గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ గమ్యస్థానంగా మారడం, ఆయా కంపెనీలు విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న తీరును మంత్రి కేటీఆర్ వివరించారు. స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ పాలసీలతో పాటు దేశంలోనే అత్యుత్తమ ఈకో సిస్టం తెలంగాణ సొంతమని కేటీఆర్ చెప్పారు.
వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో గత ఎనిమిదేండ్లుగా నమోదైన ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ది చెందిందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ప్రోత్సాహకాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోని ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలు తెలంగాణని తమ గమ్యస్థానంగా ఎంచుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
వర్చువల్ మస్కట్, చాట్బొట్ను ఆవిష్కరించిన కేటీఆర్
తెలంగాణ పెట్టుబడుల సలహాదారు పేరుతో రూపొందించిన వర్చువల్ మస్కట్, చాట్బొట్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ తర్వాత పలు దేశాలకు చెందిన ప్రతినిధులు వివిధ అంశాలపైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆ తరువాత దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు టీ హబ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న వివిధ స్టార్టప్ ప్రతినిధులతో సంభాషించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వీ హబ్, టీ వర్క్స్, టీఎస్ఐసీ, టాస్క్ సంస్థల లక్ష్యాలు, పనితీరును దౌత్యవేత్తలు ప్రశంసించారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, టీ హబ్ సీఈఓ ఎం శ్రీనివాస్ రావు, పరిశ్రమల శాఖ, ఐటీ శాఖకు చెందిన వివిధ విభాగాల డైరెక్టర్లు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

