కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. పవర్ లూం క్లస్టర్ల ఏర్పాటుకు డిమాండ్
Minister KTR | కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట, దుబ్బాకలో పవర్ లూం క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట, దుబ్బాకలో పవర్ లూం క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర చేనేత జౌళి శాఖ, ఆర్థిక మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ధ్వజమెత్తారు. క్లస్టర్లు ఏర్పడితేనే ఎంతో అభివృద్ధి జరుగుతుందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రాబోయే కేంద్ర బడ్జెట్లో క్లస్టర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలన్నారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తే ఊరుకోమని హెచ్చరించారు. చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది. కేంద్రం కూడా సహకరించాలి.. కేంద్రం సహకరించకపోతే ఊరుకోమని చెప్పారు. పీఎం మిత్రలో చేర్చి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత, మరమగ్గాల కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ చేనేత కార్మికుల జీవన విధానం గతం కంటే మెరుగ్గా ఉంది. 2016-17 నుండి చేనేత చేయూత, రుణ మాఫీ, మరమగ్గాల ఆధునీకరణ చేయడంతో పాటు ప్రభుత్వం నుండి నేరుగా ఆర్డర్లు ఇచ్చి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు, విద్యార్థుల కోసం యూనిఫాం, ఎన్నో ప్రభుత్వ పరమైన ఆర్డర్లు ఇచ్చామన్నారు. కార్మికుడిని యజమానిని చేసే విధంగా వర్కర్ టూ ఓనర్ పథకం ప్రవేశపెట్టామన్నారు. గత ఏడున్నరేండ్లుగా నేత కార్మికుల కోసం రాష్ట్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో వినతులు ఇచ్చినప్పటికీ స్పందన లేదన్నారు. రాష్ట్రంలో నేత కార్మికుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ హ్యాండ్ లూం కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఉలుకుపలుకు లేదన్నారు. 26 బ్లాక్ లెవల్ క్లస్టర్ ఏర్పాటు కోసం వినతులిస్తే చేసింది నామమాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

