KTR | ధరణి ముద్దు.. పట్వారీ వ్యవస్థ వద్దు.. ఆలోచించి ఓటేయండి : మంత్రి కేటీఆర్
KTR | కాంగ్రెసోళ్లు ధరణి ఎత్తేసి, పట్వారీ వ్యవస్థను తీసుకురావాలని అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్వారీ వ్యవస్థ వద్దు.. ధరణి ముద్దు అనేటోళ్లు తమకు ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం పెద్దమల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
KTR | కామారెడ్డి : కాంగ్రెసోళ్లు ధరణి ఎత్తేసి, పట్వారీ వ్యవస్థను తీసుకురావాలని అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్వారీ వ్యవస్థ వద్దు.. ధరణి ముద్దు అనేటోళ్లు తమకు ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గం పెద్దమల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ధరణి పోర్టల్‌ను ఎత్తేసి పట్వారీ వ్యవస్థ తీసుకురావాలని కాంగ్రెసోళ్లు అంటున్నారు. పట్వారీలను తీసుకొచ్చి మళ్లీ మన జీవితాలను ఆగం చేస్తారట..? రైతులను చావగొట్టి దళారుల రాజ్యం తెస్తామని అంటున్నారు. 24 గంటల కరెంట్ కావాలంటే కేసీఆర్‌కు ఓటేయండి. పట్వారీ వ్యవస్థ వద్దు.. ధరణి ముద్దు అనేటోళ్లు మాకు ఓటేయండి. ధరణిలో కూడా ఇబ్బందులు ఉండొచ్చు. ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మంచిగా చేసుకుందాం. ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లును కాలబెట్టుకోం కదా..? ధరణి కూడా 90 శాతం మంచిగా ఉన్నది. ఆ పది శాతం కూడా సరి చేసుకుందాం. పాత పట్వారీ వ్యవస్థ వద్దు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలు మారిపోతాయి..
ఎన్నటికైనా మనోడు మనోడు అయితడు.. మందోడు మందోడు అయితడు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉండే ప్రేమ రాహుల్, మోదీకి ఉంటదా..? మరి మనోడిని గెలిపించుకుందామా..? లేకపోతే ఢిల్లీ వాళ్లను నెత్తి మీద పెట్టుకుందామా..? ఆలోచించండి. కామారెడ్డికి వస్తున్న కేసీఆర్‌ను ఆశీర్వదించండి. ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. కేసీఆర్ వచ్చిండు అంటే బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రతి గ్రామంలో జరుగుతుంది. మీ పొలాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. ఇప్పటికే కాళేశ్వరం జలాలు మంచిప్ప దాకా వచ్చాయి. రాబోయే ఏడాదిలో మీదాకా తీసుకొచ్చే బాధ్యత నాది. మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్‌కు ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హయాంలో వడ్ల రాశులు కనిపించాయా..?
పెద్దమల్లారెడ్డికి వస్తుంటే వడ్లు కుప్పలు కుప్పలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఇట్ల వడ్ల రాశులు కనిపించాయా..? గతంలో కరెంట్ కష్టాలు ఉండే. అన్ని మంచిగా చేసుకుంటుంటే ఇవాళ కాంగ్రెసోళ్లకు మనసున పడుతలేదు. మళ్లా ఆగం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ రెండు టర్మ్‌ల్లో మంచి పనులు చేసుకున్నాం. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికులను పట్టించుకోలేదు. గతంలో పెన్షన్లు ఇవ్వకపోతే కాంగ్రెసోడిని అడిగినోడు లేడు. చేసింది లేదు. ఇవాళ ఇచ్చేతోని తిడుతున్నారు. నడిచే ఎద్దునే పొడుస్తం కానీ దున్నుపోతును పొడవం కదా అంటున్నారు. మీకు కూడా వస్తాయి పెన్షన్లు, తెల్ల కార్డులు వస్తాయి. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్. కలిసోచ్చే కాలానికి నడిచిచొచ్చే కొడుకు వస్తడట. అట్ల కేసీఆరే మీ దగ్గరికి వచ్చిండు కామారెడ్డికి. అన్నీ మీకు సౌలత్లు అవుతాయి. కాని పనేమీ ఉండదు. కాంగ్రెస్‌ను నమ్మి ఆగం కావొద్దు అని కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

