పేదరికంతో విద్యకు దూరం కావొద్దు : మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా విద్యకు దూరం కావొద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని, ఈ సదాశయంతోనే గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణలో ఐదు సొసైటీల ద్వారా 985 గురుకుల పాఠశాలలలో సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. బంజారాహిల్స్ లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన అత్యుత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అభినందించి, శుభాభినందనలు తెలిపారు. తెలంగాణలో నడుస్తున్న గురుకులాలను దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు కొనియాడుతున్నారని చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న, చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లో కూడా గొప్పగా రాణిస్తున్న ఈ పాఠశాలలు మనందరికీ గర్వ కారణమన్నారు. విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని మంత్రి కొప్పుల, ప్రభుత్వ సలహాదారు ఏకేఖాన్, సొసైటీ అదనపు కార్యదర్శి దిలావర్ తదితరులు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

