దేవాదాయ భూముల్లో సోలార్ మంత్రి కొండా సురేఖ
దేవాదాయశాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదాయంలేని, శిథిలావస్థకు చేరుకున్నదేవాలయాలను అభివృద్ధి చేసేందుకు కామన్ గుడ్ ఫండ్ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. టీజీ రెడ్కో సహకారంతో ఆర్థికంగా ఉపయుక్తంగాలేని భూముల్లో సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు విధివిధానాలను రూపొందించాలని, దేవాలయాలపై సౌర విద్యుత్ ఫలకలను ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
భద్రకాళి దేవాలయం, యాదగిరి గుట్ట దేవాలయాలపై ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సీజీఎఫ్‌కు రూ.150 కోట్ల నిధులను కేటాయించాలని సీఎంను కోరతామన్నారు. బోనాల కోసం విడుదల చేసిన రూ. 20కోట్లను దేవాలయాలకు మంజూరు చేయాలని తెలిపారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హన్మంతరావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

